భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలిగించాలని డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చూరా సింగ్, డీఓపీఎస్ చీఫ్ మేనేజర్ పింకీ మిట్టల్, క్రూ షెడ్యూలింగ్, ప్లానింగ్‌ని చూసుకునే పాయల్ ఆరోరాను తొలగించాలని ఎయిరిండియాకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే వారిపై అంతర్గత క్రమశిక్షణకు సంబంధించిన విచారణ జరిపి 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది. తొలగించిన ముగ్గురు అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించాలని ఎయిరిండియాకు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన 2 విమానాలు 10 గంటలు ఆలస్యంగా చేరుకోవడంపైనా ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లోగా ఈ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇకపోతే ఈ నెల 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ విమానం సాంకేతిక సమస్యలకు లోనై ఒక భవనంపై కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానం కూలిన ప్రమాదంలో 241 మంది మరణించగా.. విమానం కూలిన స్థలంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, కొంతమంది స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ఈ ఘోర ప్రమాదంలో 272 మంది మృత్యువాత పడ్డారు. మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలిగించాలని డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Share This Post