Homemain slidesకూటమిలో ‘నామినేటెడ్’ ఈక్వేషన్స్

కూటమిలో ‘నామినేటెడ్’ ఈక్వేషన్స్

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా, అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి పదవుల పంపకం కూడా పూర్తి అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీలను కూడా షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల విషయమై పార్టీల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి . ఈ రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టుల జాతర ముగించేయాలనేది కూటమి అధినేతల నిర్ణయం. మరోవైపు భర్తీలో ఈక్వేషన్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పరిపాలన పరంగా సెక్రటేరియేట్ ఎంత బిజీగా ఉంటుందో.. ప్రస్తుతానికి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూటమి పార్టీల నేతలు కూడా అంతే బిజీగా గడుపుతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నానినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని కూటమి పార్టీల నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, పురందేశ్వరి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల సమాచార సేకరణ జరుగుతోంది.

కొందరు ఎమ్మెల్యేలు సహా టిక్కెట్లు దక్కించుకోలేని చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. తమకు ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని.. 100 శాతం స్ట్రయిక్ రేట్ తో ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీకి నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా ప్రయార్టీ ఇవ్వాలని జనసేన నాయకులు భావిస్తున్నారు. ఇక జాతీయ పార్టీగా తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ కూడా భావిస్తోంది. ఇలా చూసుకుంటూ పోతే ఆశావహులు భారీగానే ఉన్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూటమి పార్టీల మధ్య బంధం మరింత బలపడేలా ఉండాలనే కానీ.. బలహీనపడడానికి బీజాలు పడేలా ఉండకూడదనే భావన కూడా మూడు పార్టీల్లో ఉంది. మొత్తంగా చూస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం పార్టీల మధ్య ఓ ఈక్వేషన్ తేవాలనే ఆలోచన చేస్తున్నట్టు మీడియా వర్గాల సమచారం. దానికి అనుగుణంగా పదవుల భర్తీ జరిగితే ఇబ్బంది ఉండదని ఎన్డీఏ నాయకులు భావిస్తున్నారు. దీనికోసం కూటమి పార్టీల అధినేతలు ఎలాంటి కసరత్తులు చేపడతారో వేచి చూడాలి.

మరికొన్ని వార్తా విశేషాలు…

హోం మంత్రికి సూటి ప్రశ్న..వైసీపీ

RELATED ARTICLES

Most Popular

Recent Comments