భారత్ సమాచార్.నెట్: ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఫైనల్ టై బ్రేక్ మ్యాచ్‌లో తన అద్భుత ప్రదర్శనతో భారత్ క్రీడాకారిణి కోనేరు హంపీని ఓడించి.. ఈ ప్రతిష్టాత్మక కప్‌ను గెలిచింది ఈ యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్‌లో తొలి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది దివ్య దేశ్‌ముఖ్. అంతేకాదు 19 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించింది దివ్య. భారత్ నుండి ఈ ఘనత సాధించిన 88వ గ్రాండ్‌మాస్టర్‌గా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది.
ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి రెండు క్లాసికల్ గేమ్స్ డ్రా కావడంతో.. విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకర్ అవసరమైంది. టై బ్రేకర్‌లో.. దివ్య తన అద్భుతమైన ప్రదర్శనతో నెగ్గింది. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించింది. కాగా, ఈ టోర్నమెంట్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఫైనల్ మ్యాచ్‌లో తలపడటం విశేషం.
మరోవైపు ఫిడే మహిళల ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నాగపూర్ చెందిన దివ్య దేశ్‌ముఖ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్‌గా నిలిచిన దివ్వ దేశ్‌ముఖ్‌ను మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన దివ్యకు అభినందనలు.. ఇది ఉత్కంఠ భరితమైన పోరు.. కోనేరు హంపి కూడా మంచి ఆటతీరును కనబర్బారని తెలిపారు. భారత చదరంగానికి ఇది సంబరాలను తెచ్చిన విజయం అంటూ రాసుకొచ్చారు.