భారత్ సమాచార్.నెట్: 19 ఏళ్ల ఇండియన్ యంగ్ సెన్సేషన్ దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన స్వదేశీయురాలు కోనేరు హంపీని ఓడించి ప్రపంచ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది ఈ యువ సంచలనం. ప్రపంచకప్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా నిలిచిన దివ్య భావోద్వేగా క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దివ్య దేశ్‌ముఖ్ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన తల్లిని కౌగిలించుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రపంచకప్ టైటిల్ సాధించిన దివ్య దేశ్‌ముఖ్‌కు భారీ ప్రైజ్ మనీ రానుంది. దివ్యకు $50,000 ప్రైజ్ మనీ అంటే భారత్ కరెన్సీలో ఇది సుమారు రూ.41.6 లక్షలు అన్నమాట. ఇక రన్నరప్‌గా నిలిచిన కోనేరు హంపికి $35,000.. సుమారు రూ.29.1 లక్షలు రానున్నాయి. మిగితా వారికి కూడా ప్రైజ్ మనీ ఇస్తారు.. అది వారి ప్రదర్శన ఆధారంగా చెల్లిస్తారు.
ఇకపోతే భారత్ నుంచి 4వ మహిళా గ్రాండ్ మాస్టర్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్ చాలా తక్కువ టోర్నీలే ఆడింది. కోనేరు హింపితో పోల్చుకుంటే దివ్య దేశ్‌ముఖ్ అనుభవం కూడా తక్కువ. తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారిణలను ఓడించి అందర్నీ ఆకట్టుకుంది. ఈ విజయంతో 2026లో జరగనున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు దివ్య దేశ్‌ముఖ్ అర్హత సాధించింది.