August 4, 2025 6:58 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

DK Shivakumar : సైకిల్ దిగబోయి కిందపడిపోయిన డీకే శివకుమార్.. వీడియో వైరల్ 

భారత్ సమాచార్.నెట్: కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి (Deputy CM), కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) డీకే శివకుమార్‌ (DK Shivkumar) సైకిల్‌ దిగబోయి కిందపడ్డారు. బెంగళూరులోని విధాన సౌధ సమీపంలో సైకిల్ తొక్కుతూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో పాటు, ఆయన ధరించిన ఖరీదైన శాలువాపైనా, నగరాల్లో మౌలిక వసతులపైనా నెటిజన్‌లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఎకో-వాక్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సైకలిల్‌పై వచ్చారు. అయితే అసెంబ్లీ మెట్ల ముందు సైకిల్ దిగుతూ ఆయన సైకిల్‌పై నియంత్రణ కోల్పోయి కిదపడ్డారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఇక ఈ ఘటనకు ముందు డీకే శివకుమారు తాను విధాన సౌధకు సైకిల్‌పై వెళ్తున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. విధాన సభకు వెళ్లడానికి నేను సైకిల్‌ను ఎంచుకున్నాను, ఎందుకంటే ప్రగతికి ఎప్పుడూ హార్స్‌పవర్ అవసరం లేదు, ప్రజా బలమే ముఖ్యం” అంటూ క్యాప్షన్ జోడించారు.
వీడియో చూసేందుకు ఇక్కడా క్లిక్ చేయండి
https://x.com/i/status/1934868365090140432
Share This Post