July 28, 2025 7:57 am

Email : bharathsamachar123@gmail.com

BS

Wi-Fi: అస్సలు వైఫైని ఎలా కనుగొన్నారో తెలుసా?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కృతయుగం.. త్రేతాయుగం.. ద్వాపరయుగం.. కలియుగం.. ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు నడుస్తోంది టెక్నాలజీ యుగం. మానవజీవితాలన్నీ ఆన్ లైన్ తోనే ముడిపడి ఉన్నాయి. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అంతా ఆన్ లైనే. అందుకే ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా మారింది. వైఫై లేకుండా క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు. వైఫై (Wi-Fi) ఆవిష్కరణ చరిత్రలో చెరగని సాంకేతిక విప్లవానికి సంకేతం. అది మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన గొప్ప ఆవిష్కరణ. ఓ రకంగా చెప్పాలటే ప్రపంచమంతా వైఫై(Wi-Fi) పైనే నడుస్తోంది. కానీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అయితే, అసలు వైఫైని ఎలా కనుగొన్నారు? ఎవరూ ఊహించని విధంగా ఓ ప్రమాదకరమైన సందర్భంలో వైఫైని కనుగొన్నారని మీకు తెలుసా? దాని వెనుక స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

బ్లాక్ హోల్స్ ప్రయోగం సమయంలో..
అది 1993.. ఆస్ట్రేలియన్ సైంటిస్టులు అంతరిక్షంలో కృష్ణ బిలాల(black holes) నుంచి సిగ్నల్స్ క్యాప్చర్ చేసే రీసర్చ్ లో మునిగిపోయారు. అందుకోసం రూపొందించిన టూల్ పై సీరియస్ గా వర్క్ చేస్తుండగా.. సరిగ్గా ఆ సమయంలోనే వారు ఒక సరికొత్త సాంకేతికను కనుగొన్నారు. బ్లాక్ హోల్స్ సిగ్నల్స్ అయితే సాధ్యం కాలేదు కానీ.. విప్లవాత్మక మార్పునకు మాత్రం దారితీసింది. ఆ తర్వాత అదే ఇంటర్నెట్ సృష్టించేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం వాడుతున్న వైఫై ( Wi-Fi) టెక్నాలజీని కనుక్కోవడానికి కారణమైంది. ఈ రీసెర్చ్‌లో డెవలప్ చేసిన గణిత సాధనం (A mathematical tool) ఆ తర్వాత వేరే సందర్భంలో వాడారు. ముఖ్యంగా 1992లో జాన్ ఓ ‘సల్లివన్ (John O’Sullivan) పరిశోధకుడు తన టీమ్‌తో కలిసి CSIROలో వైర్‌లెస్ కంప్యూటర్ నెట్వర్కులను డెవలప్ చేయడానికి దారితీసింది. ఆయన బ్లాక్ హోల్స్ రహస్యాలపై వర్క్ చేస్తుండగా వైర్ లెస్ సిగ్నల్స్ బలహీనంగా ఉండేవిద. అందుకే మాథమేటికల్ టూల్ ని వాడాడు. దీంతో రేడియో తరంగాల(radio waves) ద్వారా, అన్ని మార్గాల్లో (multipath interference) వచ్చే సంకేతాలను సరిచేయడంలో సహాయపడింది. దీనివల్ల వైర్ లెస్ డేటా బదిలీ (transfer) చాలా వేగంగా జరిగింది. దీని ఆధారంగానే వైఫైని సృష్టించారు. వైఫై టెక్నాలజీ నిత్యం అభివృద్ధి చెందుతూ.. Wi-Fi 6, Wi-Fi 7 వంటి కొత్త వెర్షన్లు అధిక వేగంతో మన ముందుకు వస్తున్నాయి. Wi-Fi 7 (Coming Soon) – 30 Gbps వేగంతో 8K స్ట్రీమింగ్ తో మెరుగైన కనెక్టివిటీ అందించనుంది!

Share This Post
error: Content is protected !!