Homemain slidesఎమ్మెల్సీ కవిత లాయర్ ఫీజు నిమిషానికి ఎంతో తెలుసా?

ఎమ్మెల్సీ కవిత లాయర్ ఫీజు నిమిషానికి ఎంతో తెలుసా?

భారత్ సమాచార్, తెలంగాణ: ఔను! మీరు చదివింది నిజమే. ఒక సగటు కార్మికులు, లేదా.. ఉద్యోగి.. నెలలో 25(వారాంతాలు తీసేస్తే) సంపాయించుకునే రూ.17000-20000 వేతనం.. ఆయన ఒక్క నిమిషానికి చార్జ్ చేస్తారు.ఆయనే ముకుల్ రోహత్గీ. దేశంలో ఆయన పేరు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. క్లిష్టమైన సంచలన కేసులు.. అసలు ఈ కేసులో ఇరుక్కుపోవడం ఖాయం అని నిర్ధారించుకున్న కేసుల్లో నూ.. ఆయన తన వాగ్దాటి.. న్యాయ నైపుణ్యం.. రాజ్యాంగ పరమైన అంశాలను జోడించి.. అనేక కేసులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆయనే తాజాగా.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ ఇరుక్కుపోయి.. విలవిల్లాడిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో సునాయాసంగా బయటకు తీసుకువచ్చారు.

ఆది నుంచి ఖరీదే!

ఏపీలో చంద్రబాబును అరెస్టు చేసి.. జైల్లో ఉంచినప్పుడు ఆయనకు బెయిల్ కోసం వాదించి.. బయటకు తీసుకువచ్చింది కూడా రోహత్గీనే కావడం గమనార్హం. అదేవిదంగా పలువురు కీలక రాజకీయ ప్రముఖుల కేసుల్లోనూ ఆయన వాదనలు వినిపించారు. ఆయా కేసుల్లో వారికి ఊరటనిచ్చారు. ఆయన కోర్టు హాల్లోకి వస్తున్నారంటే.. రాజ్యాంగం.. న్యాయ దేవత నడిచి వచ్చినట్టు ఉంటుందని.. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సదాశివం కొన్నాళ్ల కిందటే కితాబిచ్చారు. చిత్రం ఏంటంటే.. వైసీపీ అధినేత జగన్‌కు బెయిల్ వచ్చేలా వాదించిన వారిలో రాం జఠ్మలానీ తర్వాత.. ముకుల్ రోహత్గీదే కీలక పాత్ర.

అందుకే ఏరికోరి బీఆర్ ఎస్ అధినేత.. ముకుల్ రోహత్గీని ఎంపిక చేసుకున్నారు. కుటుంబం కుంటంబం అంతా.. 60 ఏళ్లకుపైగానే న్యాయ వ్యవస్థలో ఉంది. ఆయన తండ్రి, తల్లి, భార్య, బిడ్డలు కూడా న్యాయవాదులుగానే కాకుండా.. సొలిసిటర్ జనరల్ వంటి కీలక పదవులు కూడా చేశారు. కాగా.. గంటకు రూ.10 లక్షలు మినిమం చార్జీ వసూలు చేసే రోహత్గీ.. కేసు తీవ్రత(ఉగ్రవాదం, తీవ్రవాదం అయితే వేరేగా ఉంటుంది. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ కేసు)ను బట్టి ఆయన రూ.15,00,000ల వరకు చార్జీ చేస్తారు. అయితే.. దీనిని సమయం ప్రకారం లెక్కిస్తారు. ఆయన ఎంత సేపు వాదనలు వినిపిస్తే.. ఆ సమయానికే లెక్కించి చార్జీ తీసుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments