భారత్ సమాచార్, రాజకీయం : రేవంత్ రెడ్డి… ఇప్పుడు ఈ పేరు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్ అయినా ఆఫ్ లైన్ అయిన ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. పదేళ్లు అధికారానికి దూరమైపోయిన కాంగ్రెస్ కు నూతన జవసత్వాలు కల్పించి గద్దె ఎక్కించిన నాయకుడు రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొన్ని రోజులకే పీసీసీ అధ్యక్షుడి స్థాయికి చేరుకోవటం మామూలు విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ సీఎం కావడం.. యాదృశ్చికం కాదు. ఈ ఎన్నికల కోసం రేవంత్ రచించిన ప్రత్యేక వ్యూహాలు, మాటల వాగ్దాటి, ధైర్యం, ముక్కుసూటితనం.. ఇవన్నీ రేవంత్ ను సీఎం కుర్చీలో కూర్చునేట్టు చేశాయి. పార్టీలోని సీనియర్లు, జూనియర్లను అందరినీ కలుపుకుని వెళ్లి.. అధిష్ఠానం కనుసన్నలో మెలుగుతూ హస్తానికి పవర్ తెచ్చారు. రేవంత్ లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఆయన చేసిన శ్రమ.. ఆయనకున్న పట్టుదలే విజయరహస్యాలు అని ఆయన్ను గురించి తెలిసిన వారందరూ చెపుతారు.
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. సీఎం రేవంత్ రోజూ తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేస్తారు. తర్వాత గోరువెచ్చని నీటిని తీసుకుని ఓ అరగంట పాటు వ్యాయామం చేస్తారు. అనంతరం యాపిల్ లేదా పుచ్చకాయ జ్యూస్ తీసుకుని పత్రికలు చదువుతారు. స్నానం చేశాక చపాతి లేదా జొన్నరొట్టె తీసుకుంటారు. నాటుకోడి కూర ఆయనకు ఎంతో ఇష్టం. మధ్యాహ్నం కాజు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. ముద్దపప్పు, సాంబార్, పెరుగన్నం రోజూ ఇష్టంగా తింటారు.
దాదాపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రభుత్వ కార్యకలాపాలతోనే బిజీబిజీగా ఉంటారు. వ్యక్తిగత జీవితం కంటే నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం, వారికి అండగా ఉండడానికే ఆయన ప్రాధాన్యమిస్తారు. అంతే కాకుండా తన దగ్గరి వాళ్లకి, తనను నమ్ముకున్న కార్యకర్తలకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు.