July 28, 2025 5:36 pm

Email : bharathsamachar123@gmail.com

BS

నందమూరి అభిమానులకు డబుల్ ధమాకా

భారత్ సమాచార్, సినీ టాక్స్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహం బాలయ్య బాబు అభిమానులకు క్రేజీ న్యూస్ ఇది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. తారక్ ని ఇండ్రస్టీ టాప్ హీరో చేసిన సినిమా ‘సింహాద్రి’ రీరిలీజ్ తేదీ ఇటీవల ఖరారైంది. మార్చి 1న మళ్లీ ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనున్నట్లు దర్శనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో తారక్ అభిమానులు ఆ పోస్టర్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన రెండో చిత్రం. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చారు. రెండు సినిమాల్లోని ప్లాష్ బ్యాక్ సీన్స్ నందమూరి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమాల బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేయటంలో ప్లాష్ బాక్స్ సీన్స్, కథ, నందమూరి నటులు బాబాయ్, అబ్బాయ్ లు చెప్పే డైలాగ్స్ ప్రధాన పాత్ర వహించాయి. సమరసింహా రెడ్డి సంక్రాతి కానుకగా 1999 జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సిమ్రాన్, అంజలా జవేరి నాయికలుగా బాలయ్య పక్కన ఆడి పాడారు. ఇక ‘సింహాద్రి’ చిత్రం 2003 జులై 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. తారక్ ని మాస్ హీరోగా నిలపెట్టింది. ఇందులో భూమిక, అంకిత తారక్ పక్కన నాయికలుగా నటించారు.

మరోవైపు అప్పటి వరకూ టాలీవుడ్ లో ఉన్న రికార్డులన్ని బద్దలు కొట్టిన ‘సమరసింహారెడ్డి’ చిత్రాన్ని మార్చి 2న విడుదల చేస్తున్నారు. ఈ వరుస రీరిలీజ్ మూవీలతో నందమూరి అభిమానులు డబుల్ ఖుషి
అవుతున్నారు. వింటేజ్ బాలయ్యను 4కె క్వాలీటీతో వెండితెరపై చూడటానికి సినీ ప్రేమికులు మళ్లీ రెడీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించాడు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ రెండు సినిమాలకు విజయేంద్రప్రసాద్ యే కథను రూపొందించటం మరో విశేషం.

మరికొన్ని సినీ సంగతులు…

వెండితెర హాస్య బ్రహ్మను చేస్తే కనీసం…

 

 

Share This Post
error: Content is protected !!