August 5, 2025 12:04 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Droupadi Murmu: శబరిమల ఆలయాన్ని సందర్శించనున్న ముర్ము.. తొలి రాష్ట్రపతిగా రికార్డు 

భారత్ సమాచార్.నెట్: కేరళలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల (Sabarimala) ఆలయాన్ని రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సందర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన శబరిమల ఆలయంలో.. ఆడవారికి అనుమతి లేని సంగతి తెలిసిందే. పదేళ్లలోపు బాలికలు, 50 దాటిన మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే తాజాగా దేశ తొలిపౌరురాలు ద్రౌపది ముర్ము శబరిమలను సందర్శించనున్నారు. గతంలో ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారెవరూ శబరిమలను సందర్శించకపోవడం విశేషం.

ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము కేరళలో పర్యటించనున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి కొట్టాయం చేరుకుంటారు. అక్కడ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 19వ తేదీన పంపా బేస్ క్యాంపుకు వెళ్లనున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకోనున్నారు. అయితే, అందరి భక్తుల్లా రాష్ట్రపతి కొండపైకి వెళ్తారా.. లేక అత్యవసర అవసరాల కోసం ఉపయోగించే రహదారి ద్వారా ఆలయానికి చేరుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదు.
దీనిపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిర్ణయం తీసుకుంటుందని ట్రావెన్‌కోర్ దేవస్వం ప్రెసిడెంట్ ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము ఓ రికార్డు నెలకొల్పనున్నారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్‌గా ముర్ము నిలవనున్నారు. దీంతో శబరిమలను సందర్శించే ప్రెసిడెంట్‌గానే కాకుండా తొలిమహిలగా ప్రెసిడెంట్‌ ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించనున్నారు.
Share This Post