భారత్ సమాచార్.నెట్: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు మలయాళం సహా తెలుగు పరిశ్రమంలో అభిమానులు ఉన్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ప్రేమ, అభిమానం సంపాదించుకున్నారు. అటూ మలయాళం సహా ఇటు తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు దుల్కర్. తాజాగా దుల్కర్ నటించే కొత్త ప్రాజెక్టు ‘కాంత’ నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అందుకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. 1950 నాటి బ్యాక్ డ్రాప్, బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో హీరో, డైరెక్టర్ మధ్య జరిగే ఘర్షణతో టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. దుల్కర్, భాగ్యశ్రీ మధ్య జరిగే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. అలాగే సముద్రఖని దుల్కర్ సల్మాన్ మధ్య జరిగే సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి.
ఇకపోతే ఈ చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. దుల్కర్ సొంత బ్యానర్ వేఫేరర్ ఫిలిమ్స్, రానా దగ్గుబాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది. రానా ఈ చిత్రానికి నిర్మితాగా వ్యహరించడమే కాకుండా.. రానా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది.
To Watch Teaser click the link below:
https://youtu.be/ZGzTcjV-w68?si=kgfV_Z_pIFoPth4w