భారత్ సమాచార్, సిద్దిపేట ;
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నారాయణ్ రావు పేట్ లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులపై విమర్శలు గుప్పించారు. లిల్లీ పుట్ రేవంత్ రెడ్డి సిద్దిపేట కు వచ్చి మొరిగిండని ఘూటుగా విమర్శించారు. ఉద్యమాల ఖిల్లా సిద్దిపేట జిల్లా, నీ పప్పలు ఉడకవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ పేర్కొన్నారు. నీ కొడంగల్ వచ్చి నిన్ను ఒడగొట్టా, నువ్వు సిద్దిపేటకు వచ్చి ఏం చేయలేవన్నారు.నీ తాత, జేజమ్మలు వచ్చినా కూడా సిద్దిపేటలో నీ డ్రామా నడవటానికి కుదరదన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా అవుదని ప్రజలకు గుర్తుచేశారు. ఎంపి ఓటు కాంగ్రెస్ కు వేస్తే సిద్దిపేట జిల్లా లేకుండా చేస్తారన్నారు.
రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకుల కాళ్ళకు మడుగులు వొత్తుకుంటూ ఉండేవాడన్నారు. పిచ్చి మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డికి ఓటర్లు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ల రాజకీయం నడవదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామిల్లో తెలంగాణలో ఒక్కటి కూడా అమలు కాలేదని చెప్పారు. రైతు బీమా, రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, తులం బంగారం, 24 గంటల కరెంటు ఇలా ఎన్నో ఫెయిల్యూర్స్ కాంగ్రస్ హామిల్లో ఉన్నాయన్నారు. బీడీలపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పుర్రె గుర్తు పెడితే, దానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం పన్ను వేసిందన్నారు. 30 ఏళ్లు కార్మికులుగా పని చేస్తే గాని ఫించన్ ఇచ్చేది లేదని బీడీ కార్మికులకు నష్టం చేసే పనులు చేశారన్నారు.
గతంలో సిద్దిపేట జిల్లా ప్రజల పరిస్థితి బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి ఉండేదన్నారు. నేడు దాన్ని మార్చింది మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు. వలస కూలీల బతుకులను బాగు చేసింది కెసిఆర్ యేనన్నారు. బిజెపి పదేళ్లు డిల్లీలో ఉండి తెలంగాణకు చేసింది ఏం లేదన్నారు. రఘునందన్ కు సిద్దిపేట అంటే ఓర్వలేనితనమన్నారు. ఆ వకీలుకి ఎంతసేపు తన మీద పడి ఎడవటమే తెలుసన్నారు. అసెంబ్లీలో వీళ్లను ప్రశ్నించాలంటే ప్రజలు ఓట్ల రూపంలో తమ మద్దతు తెలపాలన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.