భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
భారతీయ సినీ ప్రేమికులకి సంగీతం పై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ప్రపంచ సినీ లోకం లో భారతీయ చిత్రాల్లో మటుకే ప్రత్యేకంగా పాటలు ఉంటాయి. చాలా మటుకు భారతీయులకి గీతాలు వినకుండా అస్సలు రోజే సాగదు, గడవదు. సంతోషంలో అయినా, బాధలో నైనా మనసును హత్తుకునే పాటలతో పయనం సాగిస్తాం. ఈ రోజుకి ‘పడి పడి లేచే మనసు’ (2018) చిత్రం నుంచి ప్రేయసి దూరం అయిన సందర్భంలో ప్రియుడు పాడుకునే విరహ గీతం ఎలా ఉందో ఒక సారి చూద్దాం…
చిత్రం ; పడి పడి లేచే మనసు
చిత్ర దర్శకుడు ; హను రాఘవపూడి
సంగీత దర్శకుడు ; విశాల్ చంద్రశేఖర్
గీతా రచయిత ; క్రిష్ట కాంత్
గాయకుడు ; సిద్ధ్ శ్రీరామ్
ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీవంటూ లేకుంటే..
నీతో ప్రతి పేజీ నింపేశానే.. తెరవక ముందే పుస్తకమే విసిరేశావే..
నాలో ప్రవహించే ఊపిరివే.. ఆవిరి చేసి ఆయువునే తీసేశావే..
నిను వీడి పోనందీ నా ప్రాణమే..
నా ఊపిరిని నిలిపేది నా ధ్యానమే..
సగమేనే మిగిలున్నా.. శాసనమిది చెబుతున్నా..
పోనే.. లేనే.. నిన్నుదిలే…
ఏమైపోయావే.. నీవెంటే నేనుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..
ఎటు చూడు నువ్వే.. ఎటు వెళ్లనే..
నేలేని చోటే నీ హృదయమే..
నువ్ లేని కల కూడా రానే రాదే..
కలలాగ నువు మారకే..
మరణాన్ని ఆపేటీ వరమే నీవే..
విరాహాల విషమీయకే..
ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..