Homemain slidesటాక్స్ ఊబిలో ఉద్యోగులు

టాక్స్ ఊబిలో ఉద్యోగులు

భారత్ సమాచార్, జాతీయం ;

భారత్ లో టాక్స్ పేయింగ్ పై ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్…

చదువుకున్న పాపానికి ఉద్యోగం చెయ్యాలి…
ఉద్యోగం చేసిన పాపానికి టాక్స్ కట్టాలి…

ఎంత కట్టాలి??

చిన్న లెక్క వేద్దాం… ఒకడు 30 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగంలో చేరి సంవత్సరానికి రూ.20 లక్షలు సంపాదిస్తే 30% టాక్స్ స్లాబ్ లో ఉంటాడు కాబట్టి రూ.6 లక్షలు టాక్స్ కచ్చితంగా ప్రభుత్వానికి కట్టాలి…

టాక్స్ కట్టింది పోగ ఇక మిగిలేది రూ.14 లక్షలు. అందులో రేపటి కోసం (savings) చెయ్యాలి. ఉన్నది (white) కాబట్టి రియల్ ఎస్టేట్ పనికిరాదు. మన దేశంలో మోసానికి గురికాకుండా ఉండే మార్గం స్టాక్ మార్కెట్ ఒక్కటే అని మెజారిటీ చదువుకున్న వాళ్ళందరూ తీసుకెళ్ళి అందులో కుమ్మరిస్తున్నారు.. అందుకే తెలివిగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ టాక్స్ 20% చేసింది ప్రభుత్వం..అంటే రూ.14 lakhs లో రూ.5 లక్షలు invest చేస్తే దానికి టాక్స్ రూ.1 లక్ష టాక్స్ కట్టాలి.

ఇక మిగిలింది రూ.9 లక్షలు

ఇక పొద్దునే లేవగానే బ్రష్ మీద టూత్ పేస్ట్ మీద రాసుకునే సబ్బు మీద వేసుకునే బట్టలు మీద ఇండైరెక్ట్ టాక్స్.. ఆఫీస్ కి వెళ్ళాలని కార్ కొంటే టాక్స్, అందులో పెట్రోల్ పోయాలంటే టాక్స్.. కార్ ఎక్కి రోడ్డు మీద పడితే అక్కడ టోల్ టాక్స్.. శనివారం సరదాగా సినిమాకు వెళ్తే టాక్స్.. రెస్టారెంట్ లో టాక్స్.. పిల్లలకు ఏమి కొన్నా టాక్స్.. తుమ్మితే టాక్స్ దగ్గితే టాక్స్.. ఇలా కట్టుకుంటూ పోతే కనీసం రూ.9 లక్షల్లో తెలియకుండా రూ.2 లక్షలు టాక్స్ కట్టేస్తాం. ఇలా కట్టిన టాక్స్ లన్నీ కూడితే రూ.20 లక్షల సంపాదనలో మిగిలేది రూ.9 లక్షలు.. అంటే దాదాపు మనం కష్టపడి సంపాదించిన దాంట్లో సగం ప్రభుత్వం ముక్కుపిండి లాగేసుకుంటోంది.. మనం మనకు తెలియకనే ప్రభుత్వం కోసం పని చేస్తున్నాం.

సరే ఇంత టాక్స్ పద్ధతిగా కడుతున్నాం ప్రభుత్వం మనకేమన్నా చేస్తోందా అంటే.. పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చలేము.. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభుత్వ హాస్పిటల్లో చెరలేము. కాబట్టి పిల్లల ఫీజులు ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ లు కట్టాలి మళ్లీ.. ఇన్నీ చేసి చివరకు మిగిలేది ఏంటంటే గొప్పగా నేను genuine tax payer అన్న ముద్ర.. దానికి బదులుగా టాక్స్ కట్టగానే మెయిల్ కి ఒక సర్టిఫికేట్ వస్తుంది.. దాన్ని మెడలో వేసుకుని తిరగాలి. అందుకు తప్ప కట్టే టాక్స్ మనకు ఎందుకు పనికొస్తోందో తెలియదు..

టాక్స్ కట్టే ఓ సగటు మధ్యతరగతి ఉద్యోగి ఆవేదన…

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

భారత్ లో నిరుద్యోగానికి మరో ఉదాహరణ

RELATED ARTICLES

Most Popular

Recent Comments