HomeUncategorizedఆన్ లైన్ లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకణం

ఆన్ లైన్ లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకణం

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకణాన్ని ఆన్ లైన్ లో నిర్వహించే విధంగా ఏపీ విద్యా మండలి కొత్త విధానానికి రూపకల్పన చేస్తోంది. ఉన్నత సౌంకేతికత సాయంతో వేగంగా, సమర్ధవంతంగా, జవాబు పత్రాల మూల్యాంకణంలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా కొత్త విధానాన్ని రూపొందించేందుకు బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అన్ని రంగాల్లో సాంకేతికత సాయంతో వేగంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్న తరుణంలో ఈ సాంకేతికతను విద్యా వ్యవస్థలో కూడా ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే దీన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు బోర్డు సభ్యులు పేర్కొన్నారు. ఈ విధానంలో ఒక్కో అధ్యాపకుడు తమకు పంపిన 50 ప్రశ్న పత్రాలను, వారి… వారి కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో దిద్దాల్సి ఉంటుంది. వీరు దిద్దిన జవాబు పత్రాలను.. వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరితో ఒక్కో పేపర్ మూల్యాంకనం చేయిస్తారు. ఈ విధానంలో అత్యధిక మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నూతన విధానాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా జవాబు పత్రాల మూల్యాకణంలో వేగం, పారదర్శకత పెరుగుతాయని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

అందుబాటులోకి మరో 750 ఎంబీబీఎస్‌ సీట్లు

RELATED ARTICLES

Most Popular

Recent Comments