Homemain slidesఆ ఊళ్లో అందరికీ ఇద్దరు భార్యలు

ఆ ఊళ్లో అందరికీ ఇద్దరు భార్యలు

భారత్ సమాచార్, జాతీయం : మన భారతదేశ చట్టాల ప్రకారం ఒక పురుషుడు ఒకరినే వివాహం చేసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో భార్య అంగీకారంతో మరొక వివాహం కూడా చేసుకునే వెలుసుబాటు కల్పించారు కానీ, అది కొన్ని సందర్భాల్లో మాత్రమే . కానీ ఆ గ్రామంలో మటుు ప్రతీ యువకుడు కచ్చితంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. ఈ వింత ఆచారాన్ని పాటించలేమని అంటే మాత్రం వారు ఊరును వదిలి కచ్చితంగా వెళ్లాల్సిందే. దీంతో ఆ ఊరి యువకులు రెండు పెళ్లిళ్లు చేసుకుని అక్కడే సెటిల్ అవుతున్నారు.

ఇంతకీ గ్రామం ఎక్కడ ఉందంటే.. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలోని చిన్న గ్రామం డేరాసర్. ఇది భారత్- పాకిస్తాన్ బోర్డర్ కు సమీపంలో ఉంటుంది. ఈ గ్రామంలోనే ఇద్దరు భార్యల వింత ఆచారం చాలా ఏళ్లుగా  తరతరాలుగా వస్తోంది. ప్రతీ గ్రామస్తుడికి కనీసం ఇద్దరు భార్యలు ఉండాలి. ఈ ఆచారం తమకు నచ్చలేదంటే ఆ ఊరి నుంచి గెంటివేస్తారు. ఈ గ్రామస్తులు మొదటి భార్యకు పిల్లలు ఉండరని నమ్ముతారు. పిల్లల మొహం చూడాలంటే రెండో పెళ్లి చేసుకోవాలి. ఈ వింత నమ్మకం వల్ల ఈ ఊరి పురుషులు మొదటి పెళ్లి తర్వాత రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

అయితే ఈ వింత ఆచారం వెనక ఓ కథ ఉందట. ఆ గ్రామస్తులు చెప్పిన ప్రకారం.. గ్రామంలో ఓ వ్యక్తికి పిల్లలు పుట్టలేదు. ఎన్నో మొక్కులు, దేవాతారాధనలు చేసినా, వైద్యుల దగ్గరకు తిరిగినా కూడా పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తిరగముందే ఆమెకు ఓ ఆడబిడ్డ పుట్టిందట. అప్పట్లో ఇలా చాలా మందికి ఇలాగే జరిగిందట. దీంతో ఆ గ్రామస్తులు మొదటి భార్యకు సంసార యోగం ఉండదని, రెండో భార్యతోనే అది సాధ్యమని ఫిక్స్ అయ్యారు. ఇక అప్పటి నుంచి రెండో భార్య సెంటిమెంట్ ను నమ్ముతున్నారట. ఇలా ఈ ఆచారం నేటికీ అక్కడ కొనసాగుతోంది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

ఓట్ల పండుగొచ్చింది.. దరఖాస్తు చేసుకోండి

RELATED ARTICLES

Most Popular

Recent Comments