Homemain slidesఉత్కంఠ.. 10లక్షల మందితో మోడీ సభ

ఉత్కంఠ.. 10లక్షల మందితో మోడీ సభ

భారత్ సమాచార్, పల్నాడు: టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు ఖ‌రారు కావడంతో నేడు చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభను నిర్వ‌హించాల‌ని ఆ పార్టీలు నిర్ణ‌యించాయి. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో మూడు పార్టీలూ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ ఉమ్మడి స‌భా వేదిక‌పై నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగించ‌నున్నారు.

మోదీ భారీ బహిరంగ సభ:
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. మరొవైపు వైసీపీకి ధీటుగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా సీఎం జగన్‌కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. దీనిలో భాగంగా నేడు ప్రధాని మోదీతో చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సుమారు 10లక్షల మంది హాజరుకానున్నట్లు సమాచారం. ఒకే వేదికపై ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ సీఎం చంద్రబాబు హాజరుకానుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏటువంటి హామీలు ఇస్తరనేది ఉత్కంఠ నెలకుంది.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

‘జగన్ అప్పట్లో ఏం చేసేవాడో బాగా తెలుసు’

RELATED ARTICLES

Most Popular

Recent Comments