భారత్ సమాచార్.నెట్, నల్గొండ: కంటి వైద్య శిబిరం అనేది రాజకీయాలకు అతీతమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్, శంకరా కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆరో విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కంటి సమస్యలను పరిష్కరించేందుకు ఐ ఆసుపత్రిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గత ఆరు నెలలుగా పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఐదు విడతలుగా నిర్వహించిన శిబిరాల్లో 853 మందికి విజయవంతంగా ఆపరేషన్లు చేయించామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓంకారం, గాంధీజీ విద్యాసంస్థల ఛైర్మన్ కోడి శ్రీనివాసులు, చండూరు మున్సిపల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు