Homebreaking updates newsVaishnavi Chaitanya: వైషూ.. ఇలా అయితే ఎలా!

Vaishnavi Chaitanya: వైషూ.. ఇలా అయితే ఎలా!

భారత్ సమాచార్.నెట్: ఇటీవల యువత (Youth)ను బాగా ఆకట్టుకున్న హీరోయిన్లలో బేబీ (BABY) బ్యూటీ వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ఒకరు. ‘బేబి’ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ.. యూత్‌ను తనవైపుకు తిప్పేసుకుంది. తన గ్లామర్, అభినయంతో బాగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ గుమ్మ.. తెలుగు నుంచి వచ్చిన హీరోయిన్‌ (Heroin)గా కూడా ఆమె మరికొన్ని మార్కులను కొట్టేసింది. ఇతర భాషల నుంచి వచ్చి ఇక్కడ దూసుకుపోతున్న బ్యూటీలకు వైష్ణవీ చైతన్య కంగారు పుట్టించిందని చెప్పుకున్నారు. కొంతకాలం పాటు ఆమె హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చారు.

ఈ నేపథ్యంలోనే వైష్ణవీ ‘లవ్ మీ’ (Love Me) అనే సినిమా చేసింది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవీ చైతన్య కోసమే ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్లారు. అయితే వాళ్లు ఆశించిన స్థాయిలో ఆమె పాత్ర ఆకట్టుకోలేకపోయింది. ఆమె పాత్రలో విషయం లేకపోవడం వాళ్లను చాలా నిరాశ పరిచింది. హీరోయిన్‌గా అయితే మూవీస్ చేస్తుంది కానీ ఈ ఫేమ్‌ను కొనసాగించడం ఆమెకు పెద్ద సవాలుగా మారింది. పాత్ర ఎంపికలో వైష్ణవి కొంచెం కేర్ఫుల్‌గా ఉండాలనే కామెంట్స్ వినిపించాయి.
ఇక తాజాగా విడుదలైన ‘జాక్’ (Jack) సినిమా విషయంలోనే ఆమెకి అవే కామెంట్స్ ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎంతమాత్రం ప్రాధాన్యత లేదనీ, అలాంటి పాత్రను ఆమె చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది. అభినయం ఉన్నప్పటికీ, క్యారెక్టర్ డెఫినిషన్ లోపిస్తే ప్రేక్షకులు కనెక్ట్‌ కావడం కష్టం అవుతుంది. సినిమాలలో హీరోయి‌న్‌గా  ఎంట్రీ ఇవ్వడం.. ఫస్టు సినిమాతోనే విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకోవడం తేలికైన విషయమేం కాదు. వైష్ణవీ ఇప్పటికీ కెరీర్ ప్రారంభ దశలోనే ఉంది. ఇలాంటి సమయంలో కథలు, పాత్రల విషయంలో ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments