Homemain slidesమెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి

మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి

భారత్ సమాచార్, క్రైమ్ : వాట్సాఫ్ యూనివర్సిటిలో ఛాటింగ్ చేసే విద్యార్థులు కొందరు తమకు ఏదైనా మెసేజ్ వస్తే చాలు.. అదెంటో కూడా చూడకుండా క్షణాల్లోనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న ఇతరులకు ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. అందులో అసలు ఏముందో కూడా చూడకుండా ఫార్వర్డ్ చేయడమే తమ పనిగా ఉండే నెటిజన్లు కూడా  మరికొద్ది మంది ఉంటారు. ఆ మెసేజ్ ను చదివి అది ఎంతవరకు వాస్తవం.. అందులోని విషయం నిజమా, అబద్ధమా అని కూడా ఆలోచించని టెకీలు ఉన్నారు ప్రస్తుత సమాజంలో. కొన్ని మెసేజ్ ల్లో ఇతరులపై దుష్ప్రచారం, వారి ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలు ఉండవచ్చు. లేదా తమకు నచ్చని వారిపై అభాండాలు వేసే అవకాశం కూడా ఉండవచ్చు. వాస్తవానికి ఇప్పుడు సోషల్ మీడియా నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా ప్రచారం అవుతున్న రోజుల్లో సమయాన్ని గడుపుతున్నాం మనం. నిజం చెప్పులు తొడుకునే లోపు అబద్దం ప్రపంచమంతా చుట్టే రోజులివి.

ఇక నుంచి ఇలా ఇష్టమొచ్చినట్లుగా మెసేజ్ లు ఫార్వర్డ్ చేస్తే జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. అందుకే మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు దానిలో ఏముందో.. అది వాస్తవమా? అబద్దమా? అని ఒకసారి కచ్చితంగా తరచిచూసుకోవాలి. ఇలాంటి మెసేజ్ లను కట్టడి చేసేందుకు పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అలాగే డీప్ ఫేక్ లాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం నేరమే. దీనికి అదనంగా ఐటీ చట్టం కూడా జోడించి జైలుకు పంపిస్తారు. గత సంవత్సరం ఇలాంటి మెసేజ్ లను ఫార్వర్డ్ చేసినందుకుగాను తెలంగాణలో ఎక్కువగా కేసులు నమోదు చేశారని జాతీయ నేరాల నమోదు సంస్థ నివేదిక అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికైనా మనకు వచ్చిన మెసేజ్ లను, వీడియోలను ఒక్క నిమిషం చూసి అందులో ఎలాంటి అభ్యంతరకర అంశాలు లేవంటేనే పంపించాలని నెటిజన్లు, తరచుగా మెసేజ్ లు ఫార్వార్డ్ చేసే వాళ్లు కచ్చితంగా గుర్తుంచుకోవాలి, లేకపోతే జైలుకు వెళ్లేందుకు సిద్దపడాలి మరి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

మనకు ఓటు హక్కు ఎలా వచ్చిందో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

Recent Comments