August 2, 2025 7:59 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

ఉద్యోగాల పేరుతో రూ.10లక్షలు మోసం

భార‌త్ స‌మాచార్‌.నెట్, ప్ర‌కాశం: ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో సుదర్శ హిమబిందు అనే యువతి ఉద్యోగాల పేరుతో మోస‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేయడమే కాకుండా, తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆమె ఆరోపించింది. గత ఏడాది ఆగస్టులో పేర్నమిట్టకు చెందిన బండి నవీన్, ట్రిపుల్‌ఐటీ, ఐటీఐలలో అటెండర్ పోస్టులు ఇప్పిస్తానని నమ్మబలికి, హిమబిందుతో పాటు ఆమె స్నేహితుల వద్ద సుమారు రూ.10 లక్షలు నగదు తీసుకున్నాడు. ఏడాదిగా ఎదురుచూసినా ఉద్యోగాలు రాకపోవడంతో, డబ్బులు తిరిగి అడగడానికి హిమబిందు పేర్నమిట్టలోని నవీన్ ఇంటికి వెళ్లింది. అక్కడ నవీన్, అతని భార్య భాగ్యలక్ష్మి కలిసి తనను కులం పేరుతో తీవ్రంగా దూషించి, శారీరకంగా దాడి చేశారని హిమబిందు తన ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

చెట్టుకు ఉరివేసుకొని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

Share This Post