భారత్ సమాచార్.నెట్: భారత్- పాకిస్థాన్‌తో (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో భారత కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు (Future)లో భారత్ (India)పై జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా (Terror attack) యుద్ధ (War) చర్యగానే పరిగణిస్తామంటూ కేంద్రం (Central govt) తేల్చి చెప్పింది. అంతే కాదు అదే స్థాయిలో తగిన ప్రతిచర్యలు చేపడుతామని కూడా భారత్ స్పష్టం చేసింది. శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అధిపతి అజయ్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, పాకిస్థాన్ చర్యలు, ఉగ్రవాద ముప్పు తదితర అంశాలపై చర్చినట్లు తెలుస్తోంది. ఇకపై ఉగ్రదాడులు చిన్న ఘటనలుగా పరిగణించకుండా.. దేశంపై యుద్ధానికి సమానంగా చూస్తామని కేంద్రం పేర్కొంది. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో భవిష్యత్తులో భారత్‌కు ఎదురయ్యే ఎలాంటి ఉగ్రవాద దాడినైనా ఆర్మీ సమర్థవంతంగా, శక్తివంతంగా తిప్పికొట్టనుంది.
ఇది భారత్ తీసుకున్న సమయోచిత నిర్ణయమని దేశవ్యాప్తంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాలపై పాక్ సైన్యం డ్రోన్లు, క్షిపణులు, మోర్టార్లతో విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. సాధారణ పౌరులే లక్ష్యంగా చెలరేగిపోతోంది. పాక్ దాడులు కొనసాగిస్తే తగిన విధంగా బుద్ధి చెప్పాలని కేంద్రం కీలక సమావేశాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
Share This Post