భారత్ సమాచార్ ; సినీ ప్రేక్షకుల అంచనాలకు మించి భారీ స్థాయిలో సినిమాని తెరకెక్కించే దర్శకుడు శంకర్. నటుడిగా ఒక పాత్రలో ఇంతకు మించి ఎవరూ జీవించలేరు అనేంతగా మెప్పిస్తాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’.‘ఆర్ ఆర్ ఆర్ ’ తర్వాత మెగా పవర్ స్టార్ నటిస్తున్న చిత్రం కూడా ఇదే. నేడు ఈ మగధీరుడి జన్మదినం కూడా. ఈ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి జరగండీ అనే లిరికల్ సాంగ్ ను నెట్టింట విడుదల చేశారు. కైరా అద్వాణీ ఇందులో కథానాయిక.
దర్శకుడు శంకర్ మొదటి సారి తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఆయన స్వరపరిచిన పాట హుషారుగా సాగుతోంది. అనంత శ్రీరామ్ మంచి లైన్స్ ను అందించాడు. సాధారణంగా శంకర్ చిత్రాల్లో పాటలు ఎప్పుడూ విజువల్ వండర్ గా, భారీ స్థాయిలో ఉంటాయి. దీనికి అదనంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేకూర్చిన స్టెప్పులు పాటను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాయి. లిరికల్ వీడియోను కూడా కొత్తగా డిజైన్ చేశారు. చరణ్, కైరా కాంబోలో డ్యాన్స్ బాగా కుదిరింది.
ఈ చిత్రాన్ని వేసవి చివరికి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. దీంతో పాటుగా ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సన తో తదుపరి చిత్రం ఆర్సీ 16 ని ప్రకటించాడు మెగా పవర్ స్టార్. ఆ తర్వాత ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ తో ‘రంగస్థలం’ కాంబోను రిపీట్ చేస్తున్నట్టు అధికారికంగా నేడు ప్రకటించారు. రామ్ చరణ్ 1985 మార్చి 27 న జన్మించాడు.