July 28, 2025 7:58 am

Email : bharathsamachar123@gmail.com

BS

ఏసీబీ వలలో చిక్కిన కాకినాడ జనరల్ మేనేజర్

భారత్ సమాచార్, కాకినాడ ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి తాజాగా ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ బాధితుడి నుంచి రూ.2 లక్షలు లంచాన్ని మురళి డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నుంచి న్యాయంగా తనకు రావాల్సిన డబ్బు కోసం లంచం ఇవ్వలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను రెడ్ హ్యాండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు ఎవరైన లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని అధికారులు కోరారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

నా భార్య నన్ను రోజూ కొడుతోంది…

Share This Post
error: Content is protected !!