Homebreaking updates newsసోషల్ మీడియాను ఊపేస్తున్న ఘిబ్లీ ట్రెండ్.. చాట్‌జీపీటీపై పడిన యూజర్లు

సోషల్ మీడియాను ఊపేస్తున్న ఘిబ్లీ ట్రెండ్.. చాట్‌జీపీటీపై పడిన యూజర్లు

భారత్ సమాచార్.నెట్: ఓపెన్‌ఏఐ(OpenAI) చాట్‌జీపీటిలో ఇటీవల విడుదలైన తాజా ఇమేజ్ జనరేటర్ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టూడియో ఘిబ్లీ స్టైల్ (Studio Ghibli Style)లో రూపొందించిన ఈ ఏఐ చిత్రాలు, మీమ్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఉపేస్తోంది. యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరుల ముఖాలను ఈ జనరేటర్‌ ద్వారా రూపొందించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నింపేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త ట్రెండ్‌ను వ్యాపార సంస్థలు కూడా సద్వినియోగం చేసుకుంటూ, తమ బ్రాండింగ్‌ కోసం ఈ శైలిలో ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయి. ఇందులోకి రాజకీయ నాయకులు కూడా చేరారు. తమ ఘిబ్లీ అవతారాలను సోషల్ మీడియా అకౌంట్‌ల్లో పంచుకుంటున్నారు.

ఘిబ్లీ ఆర్ట్ అంటే ఏమిటి?
ఘిబ్లీ’ అనే పదం ‘లిబియన్‌ అరబిక్‌ భాషలో ఎడారి వేడి గాలికి సూచిక’. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ యానిమేషన్‌ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లీ’ 1985లో హయావో మియాజాకి, ఇసావో టకహట, తోషియో సుజుకి లాంటి దిగ్గజాలు స్థాపించారు. ఈ స్టూడియో చేతితో గీసిన అద్భుతమైన యానిమేషన్‌, విపులమైన బ్యాక్‌గ్రౌండ్స్‌, భావోద్వేగపూరిత కథల కోసం ప్రఖ్యాతి గాంచింది. ఈ యానిమేటెడ్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఓపెన్ఏఐపై ఒత్తిడి..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లు అందరూ ఘిబ్లీ ఇమేజెస్ కోసం చాట్‌జీపీటీపై ఒక్కసారిగా పడటంతో దాని సర్వర్ కాస్తా డౌన్ అయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఘిబ్లీ ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. దీంతో స్టూడియో ఘిబ్లీ స్టైల్ యానిమేటెడ్ అవతార్ల కోసం యూజర్లు పోటీపడుతున్నారు. మొదట్లో చాట్‌జీపీటీ (ChatGPT) ఘిబ్లీ ఫీచర్ ఉచితంగానే ప్రవేశపెట్టింది. కానీ, ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ రావడంతో రోజుకు మూడు ఫొటోలే సృష్టించగలిగేలా పరిమితులు విధించింది. ప్రస్తుతం ChatGPT Plus, Pro, Team సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికే ఘిబ్లీ ఫీచర్ ఫ్రీగా అందుబాటులో ఉంది.
చాట్‌జీపీటీలో తమ చిత్రాలను చూడటం ప్రజలకు సరదాగా ఉంది కానీ, తమ జీపీయూ (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) కరిగిపోతున్నాయని ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్‌మాన్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనిని మరింత సమర్థవంతంగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments