భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కోరోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ధరలు ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండు, మూడింతలు పెరుగుతుండడం గమనార్హం. గతంలో రూ.90 వేల వరకు ఉన్న బంగారం ధరలు.. ఇప్పుడు ఏకంగా రూ. 1లక్ష దాటేసింది. తగ్గినట్లే తగ్గి భారీగా ఎగబాకుతోంది. బుధవారం తులం బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారంతో పోల్చుకుంటే తులం బంగారంపై రూ.900 లకు వరకు పెరిగింది. గత రెండు రోజుల కిందటి ధరను చూస్తే తులంపై ఏకంగా రూ.1500 ల వరకు పెరిగింది. రెండుమూడు రోజుల ధరలను పరిశీలిస్తే తులంపై దాదాపు రూ.3 వేలకుపైగా పెరిగింది. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతోంది. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02230 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,710 గా ఉంది. అదే 18 గ్రాముల ధర 76,680 వద్ద కొనసాగుతోంది.
