July 28, 2025 5:11 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Google: 11 వేల ఛానల్స్ యూట్యూబ్ నుంచి అవుట్.. కారణం ఇదే

భారత్ సమాచార్.నెట్: ప్రపంచవ్యాప్తంగా 11 వేల యూట్యూబ్‌ ఛానల్స్‌ను తొలగించింది గూగుల్. వాస్తవాలను వక్రీకరిస్తూ వివిధ దేశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను దారి తప్పించేలా కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించిన గూగుల్ వాటిని తొలగించింది. గూగుల్ తొలగించిన వాటిలో అధిక సంఖ్యలో చైనా, రష్యాకు చెందిన యూట్యూబ్ ఛానల్స్‌ ఉన్నాయి. ఇందులో చైనాకు చెందినవి 7,700 ఛానెల్స్ ఉండగా.. రష్యాకు చెందినవి 2 వేలకు పైగా ఛానెల్స్ ఉన్నాయి.

 

చైనాకు చెందిన ఛానల్స్‌లో భారత్‌లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ప్రచారాలు నిర్వహిస్తూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసించేలా కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఇక రష్యాకు చెందిన యూట్యూబ్ ఛానల్స్‌ ఉక్రెయిన్ నాటోలను విమర్శిస్తూ.. రష్యాకు మద్దతుగా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.

 

ఇక వీటితోపాటు ఇజ్రాయెల్, ఇరాన్, టర్కీ, ఘానా, రోమేనియా, అజర్‌బైజాన్ దేశాలకు చెందిన యూట్యూబ్‌ ఛానల్స్‌ను గూగుల్ తొలగించింది. ఈ ఛానళ్లు అన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగే.. నిరాధార, కల్పిత కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. ఇకపోతే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొత్తం 23 వేలకు పైగా ఖాతాలను గూగుల్ తొలగించిన సంగతి తెలిసిందే.

Share This Post
error: Content is protected !!