భారత్ సమాచార్.నెట్, ఏలూరు: ఆదివాసీలు వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు విద్యపై దృష్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ తెలిపారు. శనివారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేఆర్ పురం ఐటీడీఏ వద్ద జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీ ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. ఐటీడీఏ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పీవో రాములు నాయక్ వివరించారు. ఈ వేడుకల్లో వివిధ నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు