Homemain slidesజనవరి 6,7న గ్రూప్-2 ఎగ్జామ్?

జనవరి 6,7న గ్రూప్-2 ఎగ్జామ్?

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : ఓసారి నిరుద్యోగుల ఆందోళనతో, మరోసారి ఎన్నికల కోడ్ తో వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎన్నికల కారణంగా ఎగ్జామ్ నిర్వహించలేని పరిస్థితిలో టీఎస్పీఎస్సీ జనవరి 6,7 తేదీలకు వాయిదా వేసింది. అయితే సోమవారం ఈ ఎగ్జామ్ నిర్వహణపై టీఎస్పీఎస్సీ ఆఫీసులో కమిషన్ సమావేశమై చర్చలు జరిపింది. పరీక్ష నిర్వహణ, వసతులు, నిబంధనలు తదితర అంశాలపై 33 జిల్లాల కలెక్టర్లకు పలు సూచనలు అందించింది. ఇంతకుముందు గుర్తించిన పరీక్షా కేంద్రాల్లో మార్పులు, చేర్పులు ఉంటే తమకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాలను ఈనెల 7లోగా ఫైనల్ చేసి తమకు నివేదించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కోరింది.

అయితే టీఎస్పీఎస్సీ నిర్ణయంపై మెజార్టీ నిరుద్యోగులు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు ప్రక్షాళన తర్వాతే పరీక్ష పెట్టాలని విద్యార్థులు సూచిస్తున్నారు. బోర్డులో జరిగిన అవినీతి, నిర్లక్ష్యంతోనే తమ జీవితాలు నాశనమయ్యాయని, మళ్లీ అదే బోర్డు ఆధ్వర్యంలో ఎగ్జామ్ రాయమంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులు, వారి కుటుంబాల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, బోర్డు ప్రక్షాళన చేస్తామని ఆ పార్టీ చెప్పిందని మరోసారి గుర్తుచేస్తున్నారు. లీకేజీలు, ఎన్నికలతో తమ ప్రిపరేషన్ టైం చాలా ఎక్కువగా కోల్పోయామని, మళ్లీ నెలలో పరీక్షలు పెడ్తామంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు అభ్యర్థులు మాత్రం ఈ గ్రూప్-2ను ఇలాగే నిర్వహించి, ఏప్రిల్ 1న మరో గ్రూప్-2కు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాలకు పైబడి ప్రిపరేషన్ లో ఉన్నామని, ఇంకెంత కాలం ప్రిపరేషన్ లో ఉండాలని వాపోతున్నారు. ఇప్పటికే అప్పుల పాలయ్యామని, రూ.5 భోజనంతో కడుపు నింపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా లోక్ సభ ఎన్నికలలోపు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన 80 వేల పోస్టులను భర్తీ చేసి, ఆ తర్వాత 2 లక్షల పోస్టులకు గాను జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

మరికొన్ని కథనాలు…

ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల మార్పు

RELATED ARTICLES

Most Popular

Recent Comments