Homemain slidesటీవీ లైవ్ లోకి ముష్కరులు..తలకు గన్ను పెట్టి..

టీవీ లైవ్ లోకి ముష్కరులు..తలకు గన్ను పెట్టి..

భారత్ సమాచార్, అంతర్జాతీయం : ఈక్వెడార్ రాజధాని గ్వయకిల్ లో సాయుధులైన కొందరు దుండగులు నిన్న టీసీ టీవీ చానల్ లైవ్ లోకి ప్రవేశించి కలకలం సృష్టించారు. మాస్క్ లు ధరించి తుపాకులు, డైనమేట్లతో వచ్చిన వీరు.. వార్తలు చదువుతున్న న్యూస్ ప్రజెంటర్ సహ అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. వారిని నేలపై కూర్చోబెట్టి తలపైకి తుపాకీ పెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులు మిమ్మల్ని కాపాడలేరంటూ బెదిరించారు. ఇది లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. లైవ్ లో తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయి. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు.

ప్రస్తుతం 13 మంది ముష్కరులను అదుపులోకి తీసుకుని, ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. దాడి వెనక ఎవరున్నారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల జైళ్ల నుంచి ఇద్దరు డ్రగ్ గ్యాంగ్ స్టర్లు తప్పించుకున్నారు. ఆ తర్వాతే దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

టీసీ టీవీ చానెల్ అధిపతి మాన్రిక్ ఈ భయానక ఘటన గురించి మాట్లాడుతూ.. దుండగులు స్టూడియోలోకి వచ్చినప్పుడు తాను కంట్రోల్ రూంలో ఉన్నానని, వారిలో ఒకడు తన దగ్గరకు వచ్చి తలపై గన్ పెట్టి నేలపై కూర్చోవాలని బెదిరించినట్టు చెప్పాడు. తామింకా ఆ షాక్ నుంచి బయటపడలేదు..దేశం విడిచి వెళ్లిపోవాలని అనిపిస్తుందంటూ వాపోయాడు. స్టూడియోలో జరుగుతున్న ఘోరమంతా దాదాపు 15 నిమిషాల పాటు లైవ్ లో ప్రసారమైందన్నాడు. పోలీసులు చుట్టుముట్టారని తెలిసిన తర్వాత దుండగులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని మాన్రిక్ చెప్పాడు.

ఈక్వెడార్ లో గత కొన్ని రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. కొందరు పోలీసు అధికారులు కూడా కిడ్నాప్ అయ్యారు. గ్యాంగ్ స్టర్లు తప్పించుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు డేనియల్ నోబోవా దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. టీవీ స్టూడియో ముట్టడి తర్వాత డ్రగ్స్ సరఫరా చేసే 20 ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. వారు ఎక్కడ కనిపించినా హతమార్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. దేశం ప్రస్తుతం అంతర్గత సాయుధ ఘర్షణను ఎదుర్కొంటోందని త్వరలోనే శాంతి స్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

వైన్ లోనే డి‘వైన్’.. ఆ కిక్కే వేరప్పా

RELATED ARTICLES

Most Popular

Recent Comments