Homebreaking updates newsషారుఖ్ తో పిల్లలను కంటా: రాఖీ సావంత్

షారుఖ్ తో పిల్లలను కంటా: రాఖీ సావంత్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ లో కొందరి పేర్లు చెప్పమంటే అందరికి ఠక్కున గుర్తొచ్చే పేరు రాఖీ సావంత్.. ఎప్పుడూ తన వైరైటీ కామెంట్స్ తో, పిచ్చి చేష్టలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. స్కిన్ షోతో పాటు స్పైసీ కామెంట్స్ చేయటం రాఖీకే సొంతం. జనాల దృష్టిలో పడేందుకు ఇలా చేస్తుందా? అని కొందరు సినీ జనాలు విమర్శిస్తుంటారు కూడా. తాజాగా రాఖీ సావంత్ అలాంటి వ్యాఖ్యలే చేసి మళ్లీ నెట్టింట వైరల్ గా నిలిచింది.

రీసెంట్ గా ఆమె చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ తో మరో సారి నెట్టింట హెడ్ లైన్స్ గా నిలిచింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు పిల్లలను కనాలని ఉందని చెప్పింది. తన పిల్లలు ఏ బాలీవుడ్ హీరోలాగా ఉండాలనుకుంటున్నారని అడిగినా ప్రశ్నకు.. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ లాంటి అబ్బాయికి జన్మనివ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపింది . ఈ హాట్ బ్యూటీ సమాధానం అంతటితో ఆగిపోలేదు మరి, ఇందుకోసం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ స్పెర్మ్స్ ను ఇస్తే సరిపోతుందని.. బిడ్డను కనేస్తానని బోల్డ్ కామెంట్స్ జనాలపై వదిలేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారిపోయాయి. ఇదిలా ఉండగా కింగ్ ఖాన్ షారుఖ్ ఫ్యాన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా అని నెట్టింట భారీ స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

సెలబ్రిటీలు చేసే ప్రతీ కామెంట్ కు ఎక్కడో ఓ చోట దాని ప్రభావం ఉంటుంది. వార్తల్లో నిలువాలని చూసి ఇతరులను ఇబ్బంది పెట్టడం అంతా మంచిది కాదని నెటిజన్లు హితువు పలుకుతున్నారు. అయితే ఇలాంటి భామలు ఎవరెన్నీ చెప్పినా వినిపించుకోరు కదా.. మరింత ఎక్కువే చేస్తుంటారు అని అంటున్నారు సినీ ప్రేక్షకులు. అందుకే జనాలు కొందరినీ అలా వదిలేయాలి అంతే.. ఎందుకంటే వారు మారే మనుషులు కాదు కదా అని అంటున్నారు. ఈ కామెంట్స్ పై షారుఖ్ ఫ్యాన్స్ కూడా తగ్గేదే లే అంటూ నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విమర్శలని రాఖీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments