Homebreaking updates newsఅల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం

అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం

భారత్ సమాచార్, విశాఖ పట్నం ;

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించాను. అల్పపీడన ప్రభావం, వర్షాతం తదితర వివరాలు అధికారులు వివరించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. చిత్తూరు, కర్నూలు, నంధ్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అయితే విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షణ చేస్తున్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాల నేపధ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు సూచనలు చేస్తున్నారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శ్యాటిలైట్ ఫోన్స్ పని తీరు పరిశీలన చేశారు. జిల్లాల్లో అత్యవసరమైతే శ్యాటిలైట్ ఫోన్స్ వినియోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు(అక్టోబర్ 16) చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు.అటు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 17 వరకు సెలవులు ఇచ్చారు.

మరికొన్ని వార్తా కథనాలు..

ఏపీకి మూడు తుపాన్ల హెచ్చరిక

RELATED ARTICLES

Most Popular

Recent Comments