భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన వర్షం నగరాన్ని ముంచేసింది. నగరాన్ని మొత్తం అంధకారంలోకి నెట్టేసింది. వర్షం ధాటికి రోడ్లు అన్ని జలమయ్యం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా నగరంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ నగర అంతటా వర్షం కురిసింది. గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేకపేట్, మణికొండ, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట, మధురానగర్, బోరబండ, యూసుఫ్ గూడలో భారీ వర్షం కురిసింది. ఇక ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, మెహిదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కోండ, ఖైరతాబాద్, లక్డీకపూల్, జియాగూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
మరోవైపు వర్షం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. పరిస్థితి తీవ్రతను గమనించిన నగర పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశాయి. వాహనదారులు, ప్రజలు ఇళ్లు, ఆఫీసుల్లోనే ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వర్షం పూర్తిగా నిలచే వరకు ఆఫీసుల్లో ఉన్న వాళ్లు బయటకు రాకుండా ఉండాలని కోరింది.
To Watch Video Click the link below:
https://x.com/KP_Aashish/status/1952358008484175975