July 28, 2025 8:06 am

Email : bharathsamachar123@gmail.com

BS

MLC Kavitha: కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?

భారత్ సమాాచార్.నెట్, హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్‌) అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై జాగృతి కార్యకర్తులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే కవిత నివాసంపై తీన్మార్ మల్లన్న వర్గం దాడి చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆమె ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం వెనుక తమ పోరాటం ఉందంటూ కవిత వర్గం వేడుకలు చేసుకుంది. దీనిపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ.. రావులకు బీసీలకు ఏం పొత్తు.. బీసీలకు నీకు మంచం పొత్తు ఉందా అంటూ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మల్లన్న వ్యాఖ్యలు కవిత వర్గానికి ఆగ్రహం తెప్పించాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని మేడిపల్లిలో ఉన్న క్యూ న్యూస్ ఆఫీస్‌పై కవిత వర్గం దాడి చేసింది. ఆఫీసులో పర్నిచర్ ధ్వంసం చేయడంతో.. మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడితో మల్లన్న కవిత వర్గానికి వార్నింగ్ ఇచ్చారు. బీసీల తడాఖా చూపిస్తామని హెచ్చారించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత ఇంటి వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు అధికారులు.
Share This Post
error: Content is protected !!