August 4, 2025 6:58 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

RajaSaab దద్దరిల్లిన ‘రాజాసాబ్’ టీజర్, ఫోటోగ్యాలరీ

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ గా రానున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాజా సాబ్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయనున్నాడు.

Share This Post