August 6, 2025 9:19 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Today Horoscope నేటి రాశిఫలాలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దిన ఫలాలు (ఆగస్టు 6, 2025): మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

మేషం: వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఫలితం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన ఉంటుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలం, ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృషభం: ఈ రాశివారికి హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాగా బిజీగా ఉంటారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది.

మిథునం: ఈ రాశివారికి ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాలు ఇస్తాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.

కర్కాటకం: ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. పెండింగ్ పనుల్ని పట్టుదలతో పూర్తిచేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.

సింహం: ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. భారీ లక్ష్యాలతో కొద్దిగా ఇబ్బంది పడతారు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్ అందుతుంది.

కన్య: ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలు పంచుకుంటారు. ఊహించని విధంగా ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

తుల: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం, ప్రాభవం మరింత పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. రాదని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది.

వృశ్చికం: ఈ రాశివారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

ధనుస్సు: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ఆలయాల సందర్శనకు బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

మకరం: ఈ రాశివారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక బలం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోత్సాహకాలు, ప్రతిఫలం అందుతాయి.

కుంభం: ఉద్యోగంలో పని భారం పెరిగినా ఫలితం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన ఉంటుంది. ప్రతి పనిలోనూ కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు.

మీనం: ఈ రాశివారి కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఒకటిరెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థత మరింతగా వెలుగులోకి వస్తుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల వార్తలు వింటారు.

Share This Post