August 7, 2025 12:17 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Hotel Opening: జడ్చెర్లలో “యజ్ఞేష్ విరాట్ హోటల్” ప్రారంభోత్సవం

భారత్ సమాచార్.నెట్: జడ్చెర్లలో యజ్ఞేష్ విరాట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ హాజరయ్యారు. హోటల్‌ను సందర్శించి ఆయన హోటల్ నిర్వాహకులు రామ్మోహన్, లక్ష్మణ్‌లను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో స్వదేశీ వ్యాపారాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా ఇలాంటి వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందడం ఆనందదాయకం. యువత ఉత్సాహంతో స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం హర్షించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు.
అదే విధంగా యజ్ఞేష్ హోటల్‌లో మట్టి గ్లాస్‌లో చాయ్ ఇవ్వడం వినియోగదారులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా.. స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో స్ఫూర్తిదాయక చర్యగా అభివర్ణించారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్థానికులు పాల్గొని హోటల్ నిర్వాహకులను అభినందించారు.
Share This Post