Homemain slidesNTR: జూనియర్ ఎన్టీఆర్ ని చూసి భయపడుతున్న బాలీవుడ్ స్టార్..!

NTR: జూనియర్ ఎన్టీఆర్ ని చూసి భయపడుతున్న బాలీవుడ్ స్టార్..!

భారత్ సమాచార్. నెట్, ముంబై: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై బీటౌన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన బాలీవుడ్‌లోనూ ఓ బిగ్ బ్యాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్ 2’ (War 2) ఈ ఏడాది ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే,తాజాగా జార్జియాలో జరిగిన ఈవెంట్‌లో హృతిక్ రోషన్ వార్ 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “వార్‌కు సీక్వెల్ చేయాలన్న ఆలోచన మొదట కొంచెం భయపెట్టింది. కానీ ఇప్పుడు ఫినిష్డ్ వర్షన్ చూస్తుంటే గర్వంగా ఉంది. ఇది మొదటి పార్ట్ కంటే డబుల్ యాక్షన్, డబుల్ ఎమోషన్‌తో ఉంటుంది” అంటూ చెప్పేశాడు.

అయితే టాక్ ఆఫ్ ది ఈవెంట్ అయిందది కాదు! ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయాల్సి ఉందంటూ హృతిక్ ఓ బోల్డ్ కామెంట్ చేశాడు. “తారక్‌తో స్టెప్పులేయాలంటే కాస్త భయం వేసింది! ఆయన ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేస్తాడు. నేను కూడా కాస్త బాగా డ్యాన్స్ చేయగలననే ఆశిస్తున్నా!” అని హృతిక్ కామెంట్స్ చేశాడు. కాగా.. ఈ కామెంట్లపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ కామెంట్లపై ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు. హృతిక్ లాంటి స్టార్ నుంచి ఇలాంటి కామెంట్లు రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇఖ, ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిలింస్ భారీగా నిర్మిస్తోంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments