July 28, 2025 6:18 pm

Email : bharathsamachar123@gmail.com

BS

జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం!

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు (Delhi High court) న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Judge Yashwant Varma) ఇంట్లో మార్చి 14న అగ్నిప్రమాదం సంభవించింది. అయితే మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి భారీగా నోట్ల కట్టలు బయటపడటంతో ఒక్కసారిగా షాక్‌గు గురయ్యారు. హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా డబ్బులు దొరకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో సుప్రీంకోర్టు (Supremecourt) చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna )నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయనను మరో హైకోర్టుకు బదిలీ చేసింది.

అయితే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలో లేరు. దీంతో ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను ఆర్పేశాక భారీ నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తిచారు అధికారులు. ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ దృష్టికి చేరడంతో.. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. కాగా గతంలో కూడా యశ్వంత్ వర్మ అక్కడే పనిచేశారు. 2021లో ఆయన ఢిల్లీకి వచ్చారు.

ఈ ఘటనను బదిలీతో వదిలేయకూడదని.. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఘటన అని ఐదుగురు సభ్యులున్న కొలీజియం పేర్కొంది. జస్టిస్‌ యశ్వంత్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా కొలీజియం తీవ్రంగా తప్పుపట్టింది. యశ్వంత్ వర్మను రాజీనామా చేయాలని కోరడమే లేదా ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమే చేయాలని కోరారు. కాగా, రాజ్యాంగ న్యాయస్థానం న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు 1999లో సుప్రీంకోర్టు ఓ విధానాన్ని రూపొందించి. దీని ప్రకారం ఫిర్యాదు అందిన వెంటనే.. ప్రధాన న్యాయమూర్తి సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ కోరుతారు. ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.

Share This Post
error: Content is protected !!