August 4, 2025 4:53 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని..

భారత్ సమాచార్.నెట్, ఉత్తరప్రదేశ్: ప్రాణంగా ప్రేమించిన భార్య తనను మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. భార్య మరొ వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసిన అతను గత కొన్ని రోజులు తీవ్ర మనస్థాపానికి గురై భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక ఉరివేసుకున్నాడు. అంకిత్ అనే యువకుడికి నాలుగు నెలల క్రితం వివాహం అయింది. అంకిత్ భార్య అర్థంలేని కారణాలతో తన ఇంటిని వదిలి వెళ్లిపోయిన తర్వాత అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసి జీవితంపై ఆశ కోల్పోయాడు. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.

భార్య అక్రమ సంబంధం, పోలీసులు పట్టించుకోలేదు:
భార్య తనకు చేసిన మోసాన్ని, తన బాధను వివరిస్తూ ఒక వీడియో రికార్డ్‌ చేసిన తర్వాత ఆతడు ఉరేసుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియోలో అతడు తన భార్య మోసం చేసిన తీరు, ఆ మోసం తనపై చూపిన ప్రభావం, న్యాయం కోసం తాను చేసిన ప్రయత్నంలో ఎలా విఫలమయ్యాడో పూర్తి తెలిపాడు. అతడు వీడియోలో ఈ విధంగా చెప్పాడు. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు నాలుగు రోజులపాటు నోయిడా సెక్టర్-39 పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ చౌకీ చుట్టూ తిరిగినా తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల నిర్లక్ష్యమే తన ఆత్మహత్యకు కారణమని చెప్పుకొచ్చాడు. విచారణలో ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ఈ వాస్తవం అతడిని తీవ్రంగా కలచివేసింది. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, న్యాయం చేయాలని వెళ్లితే అధికారులు పట్టించుకోకపోగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉరి వేసుకున్నాడు. తమ కుమారుడికి న్యాయం జరగాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

మరిన్ని కథనాలు:

అక్రమ సంబంధం అంటకట్టారని ఇద్దరు ఆత్మహత్య..!

Share This Post