July 29, 2025 12:37 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

అనుమానంతో అంతమొందించాడు

భారత్ సమాచార్.నెట్, తూర్పుగోదావరి: అనుమానం పెనుభూతమైంది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

అనుమానం పెంచుకుని..దారుణంగా హతమార్చి:
రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరు గ్రామానికి చెందిన ఉషారాణి(45)కి నర్సీపట్నం మండలం గిడుగుటూరు గ్రామానికి చెందిన వేమగిరి మాణిక్యంతో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత వీరు కొంతమూరు గ్రామానికి వచ్చేశారు. అతను వెల్డింగ్ పనిచేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసేవాడు. ఈ ఇద్దరి దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు నిహంత్, ఏడేళ్ల కుమార్తె నిస్సి ఉన్నారు.  అనుమానంతోనే తరచూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఇక భర్త వేధింపులను భరించలేక భార్య రాజానగరం పోలీసులను ఆశ్రయించింది. భర్త తనను పెడుతున్న టార్చర్‌ గురించి ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి నుంచి మాణిక్యం ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గత రాత్రి ఇంటికొచ్చిన మాణిక్యం భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య గొడవ పెరగడంతో మాణిక్యం సమీపంలోని నాపరాయి తీసుకుని భార్య తలపై బలంగా కొట్టడంతో వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు.

Share This Post
error: Content is protected !!