July 28, 2025 8:12 am

Email : bharathsamachar123@gmail.com

BS

తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగరా.. ఎన్నికల షెడ్యూల్ విడుదల

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో మరో ఎన్నికకు నగరా మోగింది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad Local Bodies Quota MLC) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల (Notification Schedule Release) చేసింది. ప్రస్తుతం ఎం.ఎస్. ప్రభాకర్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇక హైదరాబాద్‌ (Hyderabad) జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి రానున్నట్లు ఈసీ పేర్కొంది.

ఇందుకు సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల స్క్రూటిని 7న ఉంటుంది. నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు ఏప్రిల్ 9 వరకు అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 23న ఎన్నిక జరగనుండగా.. 25న ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతను ప్రకటిస్తారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మూడు కాంగ్రెస్‌కు, ఒకటి సీపీఐకు, మరొకటి బీఆర్ఎస్‌కు దక్కింది. అయితే.. ఆ సయమంలో తమకు సహకరించాలని తద్వారా హైదరాబాద్ స్థానిక సంస్థ సంస్థల కోటా ఎమ్మెల్సీకి మీకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో అవగాహనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజం అయితే ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని దించకుండా ఎంఐఎంకు మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలో ఎలాంటి వ్యూహం అవలంభించాస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Share This Post
error: Content is protected !!