Homebreaking updates news'వెంట్రుక కూడా పీకలేరు.. వచ్చే పదేళ్లు నేనే సీఎం'

‘వెంట్రుక కూడా పీకలేరు.. వచ్చే పదేళ్లు నేనే సీఎం’

భారత్ సమాచార్, హైదరాబాద్: వచ్చే పదేళ్లు తానే సీఎంగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి నేడు స్పష్టంచేశారు. పోలీసు శాఖలో శిక్షణకు ఎంపికైన 13,445 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రజలు మరొసారి ఆశీర్వదిస్తే మరో పదేళ్ల పాటు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందన్నారు.

కేసీఆర్… నీ సంగతేంటో తేలుస్తా:
గులాబీ నాయకుడు కేసీఆర్‌కు సూటిగా సవాలు విసురుతున్నానని, చేతనైతే ఒక్క వెంట్రుక పీకి చూడాలని సవాల్‌ విసిరారు. ఆయన వెంటనే అధికారంలోకి వస్తా అంటున్నాడని, రా బిడ్డ ఎట్ల వస్తవో చూస్తా, ఇక్కడే ఉంటా.. నీ సంగతేందో తేలుస్తానని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రావడానికి అయితలేదు కానీ గులీబీ అధినేత కేసీఆర్‌ నల్గొండకు వెళ్లాడన్నారు. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును గెలిపించారని నల్గొ సభలో కేసీఆర్‌ అన్నారని, కానీ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని గెలిపించారని, ఏ పోటీకెళ్లినా ఈ రేసు గుర్రానిదే గెలుపని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక్కడ చర్చకు రాలేదు కానీ అక్కడ పొంకనాలు కొట్టాడు:
అసెంబ్లీలో నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాలపై మాట్లాడదామంటే రాలే కానీ నల్గొండకు పోయి బీరాలు పలికి పొంకనాలు కొట్టారని విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీలో ఓ అటెండర్‌ నాతో మాట్లాడాడు. సార్‌ ఎల్బీ స్టేడియంలో ఒక్క మాట మీరు చెబితే వింటా అన్నాడు. కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని చెప్పండి అన్నాడు. ఆ కంచర గాడిదకు మళ్లీ అధికారం అన్నది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్‌ అని కోరాడు. ఆ అటెండర్‌కు ఉన్న ఇంగిత జ్ఞానం సీఎంగా పనిచేసిన చంద్రశేఖరరావుకు లేదని ధ్వజమెత్తారు. ఆయన మళ్లీ వస్తాడంటా నడవడానికే వస్తలేదంటివి, వీల్‌ చైర్‌లో తిరుగుతున్నా అంటున్నావు ఎట్లొస్తావని నేను అడుగుతున్నా సీఎం రేవంత్‌ ప్రశ్నించారు.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

జర్మనీలో ఉద్యోగం వదిలి..కరీంనగర్ లో హోటల్ పెట్టాడు

RELATED ARTICLES

Most Popular

Recent Comments