భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)… 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) పీఓ/ ఎంటీ-XIV, సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIV ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అధిక శాతం ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌లో పీఓ, నవంబర్‌లో ఎస్‌ఓ ప్రిలిమ్స్ పోటీ పరీక్షను నిర్వహించనున్నారు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది 3,049 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ అయిన విషయం తెలిసిందే.
ఖాళీల వివరాలు… ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, స్పెషలిస్ట్ ఆఫీసర్
ఖాళీలను భర్తీ చేయనున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయోపరిమితి: పీఓ, ఎస్‌ఓలకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు తేదీలు: 01.08.2024 నుంచి 21.08.2024 వరకు.
* ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: పీఓ పోస్టులకు అక్టోబర్‌లో; ఎస్‌ఓ పోస్టులకు నవంబర్‌లో.
* ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: పీఓ- నవంబర్‌లో; ఎస్‌ఓ- నవంబర్/ డిసెంబర్‌లో.
* మెయిన్స్ పరీక్ష తేదీలు: పీఓ పోస్టులకు నవంబర్‌లో; ఎస్‌ఓ పోస్టులకు డిసెంబర్‌లో.
* మెయిన్స్ ఫలితాల వెల్లడి: పీఓ- డిసెంబర్/ జనవరి 2025లో; ఎస్‌ఓ- జనవరి/ ఫిబ్రవరి 2025లో.
* ఇంటర్వ్యూ నిర్వహణ: పీఓ- జనవరి/ ఫిబ్రవరి 2025; ఎస్‌ఓ- ఫిబ్రవరి/ మార్చి 2025.
* ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2025.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.ibps.in/ ను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.