భారత్ సమాచార్, హైదరాబాద్ ; బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ నేడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘చిత్రపురి కాలనీలో రూ.3వేల కోట్ల కుంభకోణం జరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, నా మీద కేసు పెట్టి, ఫోన్ ను సీజ్ చేస్తారా ? ఇదేనా ప్రజా పాలన ? ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్యం ? ’’ అంటూ ఆయన ప్రశ్నించారు.
చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయన్నారు. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకి వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. మొబైల్ ఫోన్లు సీజ్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారని నిలదీశారు? ఇదేక్కడి సంస్కృతని ప్రశ్నించారు. ఈ కేసు వేసింది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ అని తెలిపారు. ఇదంతా సీఎం రేవంత్ డైరెక్షన్ లోనే జరుగుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యం పై దాడని వ్యాఖ్యానించారు.
‘‘కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి, దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోను సీజ్ చేయడమేంది’’ అంటూ తాజాగా బీఆర్ఎస్ లో చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.