Homemain slides‘స్మోకీ పాన్‌’ తింటే ఇక అంతే సంగతులు...

‘స్మోకీ పాన్‌’ తింటే ఇక అంతే సంగతులు…

భారత్ సమాచార్, బెంగళూరు ;

మీరు ఆహార ప్రియుల… కొత్త కొత్తగా ఏదైన వంటకం కానీ, చిరుతిళ్లు కానీ తినాలని ఎప్పుడు పరితపిస్తుంటారా ? అయితే ఇది మీ కోసమే. ఇటీవల ఇన్ స్టా రీల్స్ చూసి వెరైటీ పుడ్ ని ఇంట్లో వండటం లేదా ఆ పుడ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్లి తినటం వంటివి బాగా ట్రెండ్ అవుతోంది. అయితే వీటితో కొన్ని సార్లు ఇవి మీ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ను కూడా తీసుకురావచ్చు జాగ్రత్తగా ఉండండి. వెరైటీ పేరుతో రసాయనాలు కలిపిన పుడ్ చోలికి మాత్రం వెళ్లకుండా చూసుకొండి. తాజాగా బెంగళూరులో ఓ 12 ఏళ్ల బాలికి ‘స్మోకీ పాన్’ తిని దాదాపుగా ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

తాజాగా బెంగళూరు నగరంలో నివసించే ఓ చిన్నారి ఇన్ స్టా రీల్స్ లో ఫేమస్ అయిన ‘స్మోకీ పాన్’ను తినింది. ఆ తర్వాత బాలికకు ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు చిన్నారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలిక చిన్న పేగు మొదటి భాగంలో రంధ్రం పడిందని తేల్చారు. ద్రవరూప నెట్రోజన్ నింపిన కిళ్లీ ‘స్మోకీ పాన్’ వల్లనే ఈ రంధ్రం ఏర్పడినట్టు తెలిపారు. ఇక చేసేదేం లేక శస్త్రచికిత్స చేసి దెబ్బతిన్న భాగాన్ని తొలగించారు. ఇలాంటి హాని కలిగించే రసాయన ఆహార పదార్థాలకు అందరూ దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.

మరికొన్ని ప్రత్యేక సంగతులు…

ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్…

RELATED ARTICLES

Most Popular

Recent Comments