భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి: బీజేపీకి ప్రజలు అండగా ఉండాలని భువనగిరి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోనీ హౌసింగ్ బోర్డు కాలనీ, ఎల్బీనగర్, బాహర్‌పెట్‌లో ఆయన ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ గెలిపించాలని ప్రచారం చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భువనగిరి పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఐటీ పరిశ్రమను నెలకొల్పి తద్వారా 30వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కట్టిస్తానని అన్నారు. ఆయన వెంట ప్రచారంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్లా నర్సింగరావు, పట్టణ అధ్యక్షులు రాజు, మున్సిపల్ ప్లోర్ లీడర్ మాయ దశరథ, విజయ్ భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పంచేద్దుల బలరాం, కౌన్సిలర్ రత్నపురం బలరాం, కవితా నర్సింహచారి, విజయ్ కుమార్, సుమ వెంకటేష్, బొర్రా రాకేష్, పట్నం శ్రీనివాస్, ఉమాశంకర్, బిజెవైఎం నాయకులు పట్నం కపిల్, పుల్ల శివ, జిల్లా నాయకులు కోళ్ల బిక్షపతి, రాత్నపురం శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
