Homemain slidesఈ చిట్కాలతో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి

ఈ చిట్కాలతో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి

భారత్ సమాచార్: మనీ మేనేజ్‌మెంట్ అంటే ఖర్చులను ట్రాక్ చేయడం, పెట్టుబడి పెట్టడం, బడ్జెట్‌ను అంచానా వేసుకోవడం , బ్యాంకింగ్ మరియు పన్నులను ముందుగానే అంచనా వేయడాన్నే మనీ మేనేజ్‌మెంట్ అంటారు . దీనిని పెట్టుబడి నిర్వహణ అని కూడా అంటారు. మనీ మేనేజ్‌మెంట్ అనేది ఆదాయాన్ని సంపాదించడానికి ఖర్చు చేసిన ఏ మొత్తానికి అయినా వడ్డీ-అవుట్‌పుట్ విలువను పెంచడానికి వ్యూహాత్మక పద్ధతులను ఉపయోగిస్తుంది.

* మీరు సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితిలో చిక్కుకున్నట్లు భావించినప్పటికీ, మీ కోసం మంచి భవిష్యత్తును సృష్టించుకోవడానికి మీరు ఈ చిట్కాలను తెలుసుకోండి మరి.

* రోజువారి ఖర్చులను లెక్కించండి
మీ రోజువారి ఖర్చులను లెక్కించుకోండి. దేనికి ఎంత ఖర్చు చేశారో ఒక డైరీలోనో లేదా డిజిటల్ యాప్లోనో రాసుకోండి. దీని ద్వారా వృధా ఖర్చులను అరికట్టవచ్చు. దీని ద్వారా మీ ఖర్చు విధానాలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందిచుకోవచ్చు.

* వాస్తవిక నెలవారీ బడ్జెట్‌ను సృష్టించండి
మీ జీవనశైలి, ఖర్చు ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌ను అభివృద్ధి చేయండి. మీరు ప్రస్తుతం వారానికి అనేకసార్లు రాత్రి భోజనం బయట చేస్తే మీ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. అందునే ఇలాటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. అప్పుడే మీ ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.

* మీ పొదుపులను పెంచుకోండి
మీకు ఏదైనా అత్యవసరంగా డబ్బు కావాలంటే ఒకరి మీద ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. దీని వల్ల మీకు వచ్చిన ఆర్థిక కష్టం నుంచి బయటపడవచ్చు. మీ బిల్లులను సకాలంలో చెల్లింకోవచ్చు. ఇబ్బందులను ఎదుర్కోకుండా మిమ్మల్ని రక్షించగలరు. కాబట్టి అత్యవసర నిధి వల్ల ఎవరి దగ్గర చేయిచాల్సిన అవసరం ఉండదు. అధిక వడ్డీ రేట్లకు అప్పు తీసుకునే పని అంతకన్నా ఉండదు.

* ప్రతి నెలా సమయానికి మీ బిల్లులను చెల్లించండి
సకాలంలో మీరు చెల్లించవలసిన బిల్లులు చెల్లించడం వల్ల మీరు ఆర్థికంగా ఒత్తిడికి గురికారు. దీని వల్లన మీకు ఎలాంటి పెనాల్టీలు పడవు. ఇంకా అవసరమైన ఖర్చులకు అధిక ప్రాధాన్యత ఇవ్వోచ్చు.

* అవసరంలేని ఖర్చులు తగ్గించండి
మనం కొన్ని సార్లు అవసరం లేకపోయినా కొన్ని విలువైన వస్తువులు కొంటుంటాము. వాటికి బదులు ఆదాయం వచ్చే వాటిల్లో మదుపు చేయండి. దీని ద్వారా మీ నెలవారీ సంపాదన కొంత మేర పెంచుకోవచ్చు.

* డబ్బులు ఉన్నప్పుడు వీటిని కొనండి
డబ్బులు ఉన్నప్పుడు బంగారం, ప్లాట్లు లేదా షేర్లు, ఇల్లు వంటి వాటిని కొనుగోలు చేయండి. ఎందుకంటే డబ్బు అత్యవసరమైనప్పుడు వాటిని తాకట్టు లేదా అమ్ముకోవడవ వల్ల సులభంగా నగదు పొందవచ్చు. మన అవసరాలు వెంటనే తీర్చుకోవచ్చు. దీని వల్ల కొత్త అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు.

* పెట్టుబడులు పెట్టండి
తక్కువ మొత్తంలో రిస్కు లేని షేర్లలో పెట్టుబడులు పెట్టండి. లేదా నెలవారిగా వడ్డీల వచ్చే కొన్ని డెడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి దీని ద్వారా పదవి విరమణ తరువాత ఎవరి మీద ఆదారపడాల్సిన అవసరం ఉండదు. వీటితో పాటు ఫిక్స్ డిపాజిట్ల ఖాతా తెరవండి మీకు డబ్బులు అందుబాటులో ఉన్నప్పుడు అందులో ఆదా చేయండి. ఈ డిపాజిట్ల నుంచి నెలవారిగా లేదా పరిమిత కాలం తరువాత వడ్డీతో సహ మీ డబ్బులు తిరిగి తీసుకోవచ్చు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

మన దేశ చట్టాల్లో ఐదు ఆసక్తికరమైన అంశాలు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments