August 9, 2025 8:58 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Defense Ministry: అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్ల నిలిపివేత.. రక్షణ శాఖ క్లారిటీ

భారత్ సమాచార్.నెట్: డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్‌లకు ప్రతిస్పందనగా అమెరికా నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలను భారత్ రక్షణ శాఖ తోసిపుచ్చింది. అమెరికా నుంచి యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోళ్లను నిలిపివేయాలని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

 

అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య విషయంలో సంబంధాలు దెబ్బతిన్న.. రక్షణ రంగ ఒప్పందాల్లో ఎలాంటి ప్రభావం చూపడం లేదని రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలు సజావుగా ఉన్నాయని పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

 

ఇకపోతే అమెరికా నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోళ్లను నిలిపివేసిందని రాయిటర్స్ వార్త సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు తెలిపింది. తాజాగా ఈ వార్తలపై రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది. కాగా, రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో సాకుగా చూపుతూ భారత్‌పై ట్రంప్ మరో 25 శాతం అదనపు టారిఫ్‌లను విధించిన సంగతి తెలిసిందే.

Share This Post