భారత్ సమాచార్, క్రీడలు ;
టీ20 2024 ప్రపంచ కప్ లో భారత్ టీం తన జైత్రయాత్రను అప్రతిహాసంగా కొనసాగిస్తోంది. సెమీఫైనల్-2 లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాడ్ జట్టు పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదట ఇంగ్లీష్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ని ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు కఠినమైన పిచ్‌పై 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో టీం ఇండియా ఈ పరుగులు చేయగలిగింది. లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చోరో మూడు వికెట్లు తీసి ఇంగ్లాడ్ పతనాన్ని శాసించారు. చివరి ఓవర్లో పరుగులు కూడా చేసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్‌ను ఇంగ్లండ్ ఓడించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో భారత జట్టు బదులు తీర్చుకుంది.
ఈ నెల 29 వ తేదీ శనివారం రాత్రి 8 గంటలకు భారత్ టీ 20 2024 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. కాగా సఫారీలకు వరల్డ్ కప్ ఫైనల్ ఆడటం ఇదే మొదటి సారి.